Tomorrow Bharat Bandh : రేపు దేశవ్యాప్తంగా బంద్‌.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబ‌ర్‌ 11వ తేదీన (బుధ‌వారం) దేశవ్యాప్తంగా జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక గాంధీనగరం కల్యాణ మండపంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ కన్వీనర్‌ మర్రా చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 

➤☛ School Holiday Cancel : ఆరోజు స్కూళ్ల‌కు సెల‌వు క్యాన్సెల్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే..

సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ తీర్పుపై పునః సమీక్ష చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని కోరారు. ఈ భారత్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే బంద్ కు మద్దతుగా.. సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

☛➤ ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై మాల సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

మా సత్తా ఏమిటో..

నవంబరు నెలలో మాలల సింహాగర్జన ఏర్పాటు చేసి మాలల సత్తా ఏమిటో నిరూపిద్దామన్నారు. రాష్ట్ర దళితసేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు మాట్లాడుతూ ఇప్పటికైనా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపకులు కేబీఆర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. దేశంలో అనిశ్చితి నెలకొందన్నారు.

ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి డిమాండ్ చేస్తున్న విష‌యం తెల్సిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. ఆగ‌స్టు 21వ తేదీన‌ భారత్ బంద్‌ను విజ‌య‌వంతం చేసిన విష‌యం తెల్సిందే.

☛➤ September Month Schools and Colleges List 2024 : స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వులే.. సెలవులే.. మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్‌ అంటే..?

 

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

#Tags