Today All Schools and Colleges Holiday : అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు... కారణం ఇదే.. అలాగే వారం రోజులు పాటు..
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి చెందిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు డిసెంబర్ 27వ తేదీన (శుక్రవారం) సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
వారం రోజులు పాటు...
నేటి నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డిసెంబర్ 26వ తేదీన (గురువారం) రాత్రి ఆదేశాలను జారీ చేశారు.
అలాగే ఏపీలో కూడా...?
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు డిసెంబర్ 27వ తేదీన (శుక్రవారం) ప్రభుతవం సెలవు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని కాలేజీలు, స్కూల్స్, కార్యాలయాలకు కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే :
జనవరి 2025 :
➤☛ నూతన సంవత్సరం – 01
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26
ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07
జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20
నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25