Gurukul School Admissions :గురుకుల పాఠశాలలో అడ్మిషన్లలకు నోటిఫికేషన్ విడుదల..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలో ఐదవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Inter, డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home jobs జీతం నెలకు 30000: Click Here
5వ తరగతిలో చేరేందుకు నోటిఫికేషన్ చేసి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్ అధికరి కే నిర్మల, ప్రిన్సిపాల్ బి.వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తులు వివరాలను వెల్లడించారు..
గురుకులంలో ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ విద్యార్థులకు నిర్వహించే అర్హత పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాను యూనిట్గా చేసుకుని ప్రవేశాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తులు పూర్తి చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులకు అధికారిక వెబ్ సైట్ https://tgswreis.telanagana , https://tgcet.cgg.gov.in లో చేసుకోవాలని సూచించారు.