School Holidays: గుడ్‌ న్యూస్.. విద్యార్ధులకు సంక్రాంతి సెలువులు ప్రకటించిన ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. అలాగే జనవరి 25, 26న కూడా సెలవు రానుంది.

Schools and Colleges Holidays : బ్రేకింగ్ న్యూస్‌.. నేటి నుంచి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు స్కూల్స్ సెల‌వులు.. ఎందుకంటే...!

#Tags