Anganwadi Dress Code news: ఇకనుంచి అంగన్‌వాడీ చిన్నారులకు డ్రెస్‌ కోడ్‌

Anganwadi childrens Dress Code

మంచిర్యాలటౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకూ డ్రెస్‌ కోడ్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారికి యూనిఫాం అందించడంపై దృష్టి సారించింది. జూన్‌లోనే కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం యూనిఫాంలను కుట్టించి పంపిణీకి సిద్ధం చేస్తోంది. అయితే అన్ని కేంద్రాలకు కాకుండా తొలి విడతగా ‘ప్రీస్కూల్‌’గా మార్చిన సెంటర్లలోని చిన్నారులకు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Click Here: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రం ఇబ్బందుల్లో చిన్నారులు

జిల్లాలో తొమ్మిది వేల మందికి..

జిల్లాలో నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు (బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, మంచిర్యాల) ఉన్నాయి. వీ టి పరిధిలో 969 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 41,477మంది చిన్నారులు ఆయా కేంద్రాలకు వస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నవి 291. వీటిని ఈ ఏడాది నుంచి ప్రీస్కూల్స్‌గా మార్చారు. ఈకేంద్రాల్లో 9 వేల మంది చిన్నారులు ఉండగా వీరందరికీ యూనిఫాం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత మిగతా కేంద్రాల్లోని వారికి పంపిణీ చేయనున్నారు.

మహిళా సంఘాలకు అప్పగింత

ఈ యూనిఫాం కుట్టే బాధ్యతలను జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే దాదాపు సగం వరకు కుట్టడం పూర్తయింది. వాటిని జిల్లా సంక్షేమ కార్యాలయానికి అప్పగించారు. యూనిఫాంకు అవసరమైన వస్త్రం ఆప్కో నుంచి ఐసీడీఎస్‌కు అందించారు. అలాగే ఫ్రా క్‌ కుట్టేందుకు రూ.60, షర్టు, నిక్కర్‌ కుట్టేందుకు రూ.80గా కుట్టుకూలి నిర్ణయించి ఇస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి నాలుగు వేల యూనిఫాంలను కుట్టించగా వాటిని ఈ నెలాఖరు వరకు చిన్నారులకు అందించాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. తర్వాత మిగతా వారి కొలతలు తీసుకోనున్నారు. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ప్రీస్కూల్‌లోని చిన్నారులందరికీ యూని ఫాం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఈనెలాఖరులోగా పంపిణీకి ఏర్పాట్లు..

ప్రీస్కూల్‌ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు యూనిఫాం అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలివిడతలో భాగంగా ఈ నెలాఖరులోగా జిల్లాలో నాలుగు వేల యూనిఫాంల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ఒకే రోజున చేపట్టాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

ప్రాజెక్టు పేరు అంగన్‌వాడీ ప్రభుత్వ పాఠశాలల్లో

కేంద్రాలు ఉన్నవి (ప్రీస్కూల్స్‌)

బెల్లంపల్లి 279 84

చెన్నూరు 245 74

లక్సెట్టిపేట 203 104

మంచిర్యాల 242 29

మొత్తం 969 291

#Tags