Anganwadi Centers News: అంగన్‌వాడీ కేంద్రాల్లో హెల్త్‌ క్యాంపులు

Anganwadi Centers Health camps

మోర్తాడ్‌(బాల్కొండ): వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటింటా ఫీవర్‌ సర్వే కొనసాగుతుండగా, క్యాంపులను నిర్వహిస్తూ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగానే మందులు పంపిణీ చేస్తున్నారు.

Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు: Click Here

జిల్లాలో 1,500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఆశా వర్క ర్లు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు అదుపులోకి వచ్చే వరకు క్యాంపుల నిర్వహణ కొనసాగిస్తామని శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. క్యాంపుల నిర్వహణ ఎలా సాగుతోందని క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలకుండా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే పెద్దాస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు.

#Tags