Students Health : విద్యార్థుల బ్యాగుల భారం.. ఆరోగ్యాల‌పై భారీ ప్ర‌భావం.. దీనికి మేలు!

పాఠ‌శాల‌, క‌ళాశాల విద్యార్థుల‌పై పుస్త‌కాల బ్యాగుల బ‌రువు భారీ న‌ష్టాన్ని త‌లెత్తేలా చేస్తుంది. విద్యార్థుల ఆరోగ్యాల‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది..

విజయవాడతూర్పు: విద్యార్థుల‌పై మోయలేని భారం పడుతోంది. తమ బరువుకు మించిన పుస్తకాల బ్యాగులను మోయాల్సి రావడంతో చిన్న పిల్లలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంత బరువుతో రెండు మూడు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి రావడంతో న‌డుము నొప్పి, డిస్క్‌ సమస్యలు, వెన్ను వంకరపోవడం వంటి సమస్యల బారినపడుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో కేజీ నుంచి పదో తరగతి వరకూ లక్షల మందికి పైగా చిన్నారులు ఉన్నారు.

Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం.. ప్రధానిగా ముహమ్మద్ యూనస్!

వీరంతా గాలి కూడా సోకని గదులు, పెద్ద పెద్ద అంతస్తుల్లోని భవనాల్లో చదువుతున్నారు. అత్యంత బరువు కలిగిన బ్యాగులను భుజాలకెత్తుకుని మెట్లు ఎక్కాల్సి రావడంతో చిన్న వయస్సులోనే వృద్ధాప్యంలో వచ్చే డిస్క్‌ ప్రోలాప్స్‌ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే చిన్నారుల్లో 50 శాతం మంది కాళ్లు, న‌డుము నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

తరచూ న‌డుము నొప్పి..

● లేత వయస్సులో పిల్లలు అధిక బరువున్న పుస్తకాల బ్యాగులను మోయాల్సి రావడం వల్ల తరచూ నడుం నొప్పి బారిన పడుతున్నారు. నాలుగు, ఐదు అంతస్తులు ఎక్కడం వల్ల ఆ నొప్పి తీవ్రతరం అవుతోంది. ఒక్కోసారి చిన్నతనంలోనే వెన్నులోని వెముకల మధ్య ఉన్న డిస్క్‌ బయటికి రావడం (డిస్క్‌ ప్రోలాప్స్‌), సయాటికా సమస్యలకు లోనవుతున్నారు.

● భుజాలపై బరువైన బ్యాగుల కారణంగా ఎక్కువ బరువు పడిన వైపునకు వెన్ను వంగి (సోకలియోసిస్‌/రైఫోసిస్‌)గూని మాదిరిగా కనిపించే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా ఆరో తరగతిలోపు పిల్లల్లో కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కాల్షియం, విటమిన్‌–డీ లోపాలుంటే.. నొప్పి, వెన్ను వంపు వస్తుందని పేర్కొంటున్నారు.

● బరువైన బ్యాగ్‌లు మోయడం వల్ల పిల్లలు మెట్లపై నుంచి పడిపోయి ఎముకలు విరగడం ఇటీవల సర్వసాధారణమైందని వైద్యులు పేర్కొంటున్నారు.

Paris Olympics: మనూ భాకర్‌కు మరో గౌరవం.. ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా..

● మెడ వెనుక భాగం లేదా లోయర్‌ బ్యాక్‌ పెయిన్‌ మొదలై.. ఒకటి లేదా రెండు చేతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆపై మెడ నుంచి భుజాల వరకూ నొప్పి వస్తుంది. లోయర్‌ బ్యాక్‌ పెయిన్‌ ప్రభావం ఒకటి లేదా రెండు కాళ్లపైనా పడుతుంది.

● పిల్లలు తమ శక్తికి మించి బరువు మోయడం వల్ల ఈ గ్రోయింగ్‌ పెయిన్స్‌ వస్తుంటాయి. కాల్షియం, ఇతర పోషకాహార లోపం ఉన్నప్పుడు ఇవి సాధారణంగా కాళ్ల పిక్కల్లో వస్తాయి. అందుకే ఇంటికి రాగానే పిల్లలు కాళ్లు నొక్కమని మారాం చేస్తుంటారు.

ఇలాగైతే మేలు..

● పాఠశాలను రెండు అంతస్తులకు మాత్రమే పరిమితం చేయాలి.

● బరువుకు మించిన పుస్తకాలు లేకుండా చూడాలి.

● రోజులో కనీసం 45 నిమిషాల పాటు పిల్లలు బయట ఆడుకునేలా చూస్తే వారిలో విటమిన్‌–డీ వృద్ధి చెందుతుంది. క్రీడలు, వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలి.

DSC 2024: డీఎస్సీ’ మరింత ఆలస్యం?.. ఎవరి వాదన వారిదే..

పాఠశాల విద్యార్థులకు భారంగా మారిన స్కూల్‌ బ్యాగ్‌ బహుళ అంతస్తుల్లో స్కూళ్లు.. బ్యాగుల్లో మోయలేనన్ని పుస్తకాలు మెడ, నడుం నొప్పితో బాధపడుతున్న చిన్నారులు

వయసుకు మించిన భారం తగదు

పిల్లలకు స్పైన్‌ సమస్యలు వస్తున్నాయి. అవి భవిష్యత్తులో మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు వయస్సుకు మించిన బరువుతో ఉన్న బ్యాగులు మోయడం మంచిది కాదు. ఇలా మోయడం వల్ల ఎక్కువ మంది మెడ, నడుం నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఆ బ్యాగులు ఎత్తుకుని మెట్లు ఎక్కడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతోంది. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

– డాక్టర్‌ అనిల్‌కుమార్‌, న్యూరాలజిస్ట్‌

Junior Assistant Posts Notification : 200 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు నియామ‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ఎంపిక విధానం ఇలా..!

#Tags