Schools : భారీ వ‌ర్షాలు.. రేపు పాఠ‌శాల‌ల‌కు..

గ‌త కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇటీవ‌లె.. వ‌ర్షాలు త‌గ్గుడంతో జిల్లాలో రేపు అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని డీఈఓ తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలల స్థితిగతులను పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను తరగతిలో కూర్చోబెట్టాలన్నారు.

CPCB Data: దేశవ్యాప్తంగా గాలి నాణ్యత మెరుగుపడుతున్న నగరాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణ‌లో మాత్రం..
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమురం భీం​ ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. సోమవారానికి రెండు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను ఇచ్చింది. ఆదిలాబాద్​, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొన్నది.

Asst Professor Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్లై చేశారా? చివరి తేదీ ఇదే

మిగతా మూడు రోజులకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్​ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది.హైదరాబాద్ ​సిటీలో 2 రోజులపాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడొచ్చని పేర్కొన్నది.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్​పూర్​ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడి ఒడిశా, పశ్చిమబెంగాల్​ తీరాల్లో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో అతి భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని తెలిపింది. అయితే, రెండు రోజుల తర్వాత ఈతీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చైనా, వియత్నాంలలో ప్రభావం చూపిస్తున్న యాగి తుఫాను ప్రభావంతో తీవ్రవాయుగుండం దూరంగా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప‌రిస్థితుల బ‌ట్టి తెలంగాణ‌లో రానున్న రెండు మూడు రోజ‌ల్లో స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

Vice Chancellor Posts: వీసీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

#Tags