School Holidays: ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు..
ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2025 | బ్లూ ప్రింట్ 2025 | టెక్స్ట్ బుక్స్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.
రానున్న రెండు మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరిపిలేని వర్షాలతో ఏపీ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.భారీ వర్షాలు, వరద ఉద్ధృతి కారణంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదేశాలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.