School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు.. కార‌ణం ఇదే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఎఫెక్ట్‌ ఇంకా చూపుతోంది. దీంతో భారీ వర్షాల ధాటికి కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా పాఠశాలలు మూసివేస్తున్నాయి ప్రభుత్వాలు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ జూలై 23న‌ ఈ సమాచారాన్ని అందించారు. అయితే కన్వర్ యాత్ర మార్గంలో వచ్చే అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలను మాత్రమే జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉత్తారఖండ్‌లో కూడా వర్షాలు బాగానే ఉన్నాయి.

చదవండి: Telangana 3days School Holidays News: తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవు ఎందుకంటే..?

ఈ ఏడాది కన్వర్ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని డీఎం తెలిపారు. హరిద్వార్‌లోని వివిధ వాహనాల్లో ప్రధాన రహదారుల గుండా గంగాజలాన్ని సేకరించడానికి పెద్ద సంఖ్యలో శివ భక్తులు ఇక్కడికి వస్తారు. అన్ని కన్వార్ రూట్లలో ఇంత రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.

#Tags