Sainik School Admissions: సైనిక్‌, మిలిటరీ స్కూళ్లలో ప్రవేశాలు

Sainik School

సైనిక్‌, రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో 9వ తరగతికి సంబంధించి బాలికలకు తొలిసారిగా ప్రవేశం కల్పించినట్లు విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్‌ ఎన్‌.విశ్వనాథరెడ్డి తెలిపారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ మిలిటరీ స్కూల్లో ప్రవేశ పరీక్షకు ఈ నెల 23వ తేదీలోపు, సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షకు డిసెంబర్‌ 16వ తేదీలోపు బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఆయా ప్రవేశ పరీక్షలు, దరఖాస్తులు, నమూనా పరీక్షలకు సంబంధించి వివరాలకు తమ సమాచార కేంద్రంలో నేరుగాను, అలాగే 86888 88802, 92999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags