Pre school education in Anganwadi centres: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య అమలుకు అనుసరించాల్సిన పద్ధతులపై కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. అజీం ప్రేమ్‌జీ సంస్థ ప్ర తినిధులు, రాష్ట్రస్థాయి అధికారులతో మంగళవా రం కలెక్టరేట్‌లో ఆయన ప్రీ స్కూల్ విద్య అమలు పై సమీక్షించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నిర్వహణ
జూన్ నుంచి అక్టోబర్ వరకు సంగారెడ్డి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నిర్వహణకు అనుసరించిన పద్ధతులు సత్ఫలితాలు ఇచ్చాయని, ఆ పద్ధతులను పెద్దపల్లి జిల్లాలో అమ లు చేసేందుకు అజీం ప్రేమ్‌జీ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారని కలెక్టర్ వివరించారు. సిలబస్, బోధన తీరుపై సూపర్‌వైజర్లు, టీచర్లకు శిక్షణ ఇస్తా రని తెలిపారు. కార్యక్రమంలో శిశు సంక్షేమశాఖ ప్రతినిధి రాహుల్, అజీం ప్రేమ్‌జీ సభ్యుడు శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
3days School Holidays: రెడ్ అలర్ట్ 3రోజుల పాటు స్కూళ్లకు సెలవు: Click Here