Students Health: విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

పాఠశాలను తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ డీడీ అక్కడి విద్యార్థులకు అందుతున్న చదువు, ఆహారంతోపాటు ఆరో‍గ్యంపై వహించే శ్రద్ధ గురించి ఉపాధ్యాయులను ఆరా తీశారు.

ముంచంగిపుట్టు: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ వై.కొండలరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2, బాలిక పాఠశాల–2లలో బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలల్లో అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు.

Strict Rules: అన్ని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు..

వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను తప్పనిసరిగా ఆస్పత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లకు పంపించరాదని సూచించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంటే పాడేరులో జిల్లా ఆస్పత్రికి తరలించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీడీ తెలిపారు.

#Tags