School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. ఎన్నిరోజులో తెలుసా..

భారత దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో రోజు రోజుకూ చలి గాలులు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని స్కూళ్లకు శీతాకాల సెలవులను మరో 5 రోజులు పొడిగించిన‌ట్లు  ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తెలిపింది. పొగమంచు భారీగా ఏర్పడుతుండటం, చలి గాలుల తీవ్రత తగ్గకపోవడంతో న్యూఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇప్పటివరకు ప్రకటించిన సెలవులను జ‌న‌వ‌రి 12వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి అతిషి ట్విట్టర్‌లో పోస్ట్  చేశారు. డిసెంబ‌ర్ 7వ తేదీ వరకు ఉన్న పాఠ‌శాల‌ల సెలవులు 12వ తేదీ వ‌ర‌కు పెరిగాయి.

దేశ రాజధానిలో పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉండ‌డంతో పాటు, చలి తీవ్రత  కూడా తీవ్రంగా కొనసాగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సంద‌ర్భంగా పాఠశాలలకు శీతాకాలపు సెలవులు పొడిగించాలని ఢిల్లీ విద్యాశాఖ నిర్ణయం తీసుంకున్న‌ట్లు తెలుస్తోంది.

School Holidays: గుడ్‌ న్యూస్.. విద్యార్ధులకు సంక్రాంతి సెలువులు ప్రకటించిన ప్రభుత్వం..

#Tags