Navodaya Admission 2024 : నవోదయలో ప్ర‌వేశాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

దేశవ్యాప్తంగా ఉన్న‌ జవహర్‌‌‌‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌‌‌‌వీ)ల్లో ప్ర‌వేశాల‌కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తులు కోరుతోంది. దేశంలోని 650 జవహర్‌‌‌‌ నవోదయ విద్యాలయాల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్‌‌‌‌ ఎంట్రీ)కి సంబంధించి జేఎన్‌‌‌‌వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి.
jawahar navodaya vidyalaya admission 2023-24

విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతుండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ 2024 ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. పూర్తి వివ‌రాల‌కు www.navodaya.gov.in వెబ్​సైట్​లో చూడొచ్చు.

☛ Dussehra Holidays 2023 Changes : ఆంధ‌ప్ర‌దేశ్‌లో దసరా సెలవుల్లో మార్పులు.. ఆ రెండు రోజులు కూడా..

ప‌రీక్షావిధానం :

రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో అయిదు విభాగాలు(మెంటల్‌‌‌‌ ఎబిలిటీ, ఇంగ్లీష్‌‌‌‌, సైన్స్‌‌‌‌, సోషల్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌, మ్యాథమెటిక్స్‌‌‌‌) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్‌‌‌‌ ఇంగ్లీష్‌‌‌‌, హిందీ భాషల్లో ఉంటుంది.

☛ Income Certificate : ఇక‌పై ఈజీగానే.. ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోండిలా.. ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల‌కు మాత్రం..

#Tags