Govt Schools Admissions : ప్ర‌భుత్వ బ‌డుల్లో ప్ర‌వేశాల‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. నూరు శాతం ఎన్రోల్మెంట్‌కు కృషి!

మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్కారు బడులను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసి మెరుగైన వసతులు కల్పించింది ఏపీ ప్ర‌భుత్వం..

నిడమర్రు: ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచేందుకు సమగ్ర శిక్ష అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్కారు బడులను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసి మెరుగైన వసతులు కల్పించారు. బోధనలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లను నియమించడం వంటి ప్రత్యేక మార్పులు తీసుకురావడంతో విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష అధికారులు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలందరూ నూరుశాతం పాఠశాలల్లో నమోదు జరిగేలా ఇప్పటికే 'నేను బడికి పోతా' అనే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు (ఎన్‌రోల్‌మెంట్‌) పెంచేందుకు సమగ్ర శిక్ష ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం 4 వారాల పాటు అన్ని పాఠశాలల పరిధిలో ‘విద్యా ప్రవేశం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని కార్యాచరణ విడుదల చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ నెల 24 నుంచి జూలై 25 వరకూ విద్యా ప్రవేశం కార్యక్రమం కొనసాగనుంది.

Gurukulam Jobs Selection List: గురుకుల కొలువుల అభ్యర్థుల జాబితా విడుదల

1 నుంచి 8 వరకూ నూరు శాతం ఎన్‌రోల్‌మెంట్‌

పాఠశాల ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలను గుర్తించాలి. వారి వివరాలు సేకరించి 1 నుంచి 8వ తరగతి వరకు అర్హత ఉన్న పిల్లలందరిని ఆ ప్రాంతంలోని ప్రభుత్వ బడుల్లో నమోదు చేసేలా కార్యాచరణ రూపొందించారు. అధికారులు పర్యవేక్షణ కోసం దీక్ష ప్లాట్‌ఫాంను వినియోగించుకోవాలని సూచించారు. బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించేందుకు ఇప్పటికే నేను బడికి పోతా ప్రత్యేక డ్రైవ్‌ జరుగుతోంది. జులై 12 వరకూ గ్రామ, పట్టణ వార్డు స్థాయిలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 6–14 వయసున్న పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

‘విద్యా ప్రవేశం’ పోస్టర్లు విడుదల

విద్యా ప్రవేశంపై సమగ్రశిక్ష అధికారులు మూడు రకాల పోస్టర్లను వాట్సప్‌ గ్రూపుల ద్వారా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల విద్యార్థుల నమోదు విశ్లేషణ రికార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యా ప్రవేశం డ్రైవ్‌ మానిటరింగ్‌ కోసం దీక్ష యాప్‌ హ్యాండ్‌ బుక్‌ను, నిర్వహణ గైడ్‌ను అధికారులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఉన్న విద్యాశాఖ అధికారులకు, హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా సమగ్ర శిక్ష అధికారులు సూచనలు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లోని అధికారులు ప్రతిరోజు ఏదోక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల నమోదుపై దృష్టి పెట్టాలి. ప్రతి విజిట్‌ ఫోటోలు దీక్ష యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని మార్గదర్శకాల్లో సమగ్ర శిక్ష అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంతో నూరుశాతం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండేందుకు అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

TS Inter Supplementary Results 2024: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

నూరు శాతం ఎన్‌రోల్‌మెంట్‌కు కృషి

6 నుంచి 14 ఏళ్లలోపు బడి ఈడు విద్యార్థులందరూ నూరుశాతం బడిలో ఉండేలా కృషి చేస్తున్నాం. విద్యా ప్రవేశం కార్యక్రమంతో స్టేట్‌ నుంచి మండల స్థాయి వరకూ ఉన్న అధికారుల సందర్శనలు ఉంటాయి. మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఫొటో దీక్ష యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

– జి.బాలయ్య, ఎంఈవో–2, గణపవరం

 CBI Takes Over NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీలో మరో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన సీబీఐ

#Tags