Latest School Holidays: విద్యార్థులకు వేసవి సెలవులు ఈ తేదీ నుంచే..!

Latest School Holidays News

2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలలకు వేసవి సెలవులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

తిరిగి జూన్‌ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పదోతరగతి వార్షిక పరీక్షలు పూర్తయి మూల్యాంకనం కూడా జరుగుతోంది. ఇక 1–9 తరగతుల విద్యార్థుఽలకు ఈనెల 6 నుంచి 18 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

19 నుంచి 21లోపు ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. చివరి రోజు ప్రొగ్రెస్‌ కార్డులు విద్యార్థులకు అందజేస్తారు.

#Tags