Talent Programs for Students: ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచేందుకు 'క‌ళ‌తిరువిజ పోటీలు..

విద్యార్థుల్లో ఉన్న ప్ర‌తిభ‌ను వెలికి తీసేందుకు ముందుకు తెచ్చిన కార్య‌క్ర‌మ‌మే ఈ క‌ళ‌తిరువిజ‌. ఈ కార్య‌క్ర‌మంలో 6 నుంచి 12వ‌ త‌రుగ‌తి చ‌దువుతున్న‌ విద్యార్థులు పాల్గొన‌వ‌చ్చు. ఈ పోటీల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త‌మిళ‌నాడు పాఠ‌శాల విద్యాశాఖ వెల్ల‌డించింది.
Kalathiruvija program at Tamil Nadu for students talent

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని వెలుగు తీసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కళా తిరువిళా పేరిట పోటీలను నిర్వహిస్తున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తమిళనాడులోని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హయ్యర్‌ సెకండరీ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరిలో (ప్రత్యేక పిల్లలు సహా) కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ‘కళతిరువిజ’ను నిర్వహిస్తోంది.

➤   Exam : ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాల్సిందే..

ఆ మేరకు పాఠశాల స్థాయిలో ప్రారంభమై స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇందులో సంగీతం, నృత్యం, నాటకం, భాషా నైపుణ్యం వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులు వివిధ పోటీలు జరగనున్నాయి. అందుకు అనుగుణంగా శుక్రవారం జిల్లా స్థాయి కళా ఉత్సవ కార్యక్రమాన్ని చైన్నె జిల్లా కలెక్టర్‌, ప్రాథమిక విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారులు ప్రారంభించారు.

#Tags