Healthy Food: విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

గిరిజన గురుకుల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఐటీడీఏ పీఓ ఖుష్బూ తమ కార్యాలయంలో వారితో చర్చించారు. విద్యార్థులు అందే ఆహారం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తెలిపిన అంశాలు..

ఉట్నూర్‌రూరల్‌: విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన చేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులకు సూచించారు. గురువారం ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన గురుకుల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. పిల్లలకు పౌష్టకాహారంతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.

Entrance Exam: వచ్చేనెల 7న కాలేజీ ఆఫ్‌ ఎక్ట్సెన్స్‌ ప్రవేశ పరీక్ష

అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి సారిస్తారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై శ్రద్ధ వహించాలని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవిలో నీటి సౌకర్యం, వసతుల కల్పనపై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయ కర్త గంగాధర్‌, వివిధ గిరిజన గురుకుల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

EAPCET and NEET: ఈఏపీసెట్, నీట్‌ విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మాక్‌ టెస్ట్‌లు

#Tags