Gurukula School Admissions: గురుకుల పాఠశాలలో దరఖాస్తులు

Gurukula School Admissions

మైనార్టీ గురుకుల(బాలికలు) పాఠశాలలో 2024–25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి జెశ్రన్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటలో తెలిపారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మైనార్టీలకు 60 సీట్లు, బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2 సీట్లు కేటాయిస్తామని వివరించారు.

6,7,8వ తరగతులలో ఉన్న ఖాళీలకు సైతం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డబ్లూడబ్ల్యూడబ్ల్యూ. టీఎంఆర్‌ఈఐఎస్‌. తెలంగాణ.జీఓవి. ఇన్‌ వైబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 9989661146లో సంప్రదించాలని సూచించారు.

#Tags