Gurukula School: గురుకుల సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ గిరిజన గురుకుల సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాలయంలో 2024–25 విద్యాసంవత్సరానికి రాత పరీక్ష ద్వారా 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మిగిలి ఉన్న సీట్లకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్ ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు. కోనవలస (బాలురు)లో 5వ తరగతి 80 సీట్లు, 6వ తరగతి 5 సీట్లు, 9వ తరగతి 3 సీట్లు ఉన్నాయి. అలాగే కురుపాం (బాలికలు)లో 5వ తరగతి 80 సీట్లు, 6వ తరగతి 1, 8వ తరగతిలో 1, 9వ తరగతిలో రెండు సీట్లు ఉన్నాయి.

భద్రగిరి (బాలురు)లో 5వ తరగతి 80 సీట్లు, 6వ తరగతి 4 సీట్లు, 7వ తరగతి 8, 8వ తరగతిలో 3, 9వ తరగతిలో 3 సీట్లు ఉన్నాయి. కొమరాడ (బాలురు)లో 5వ తరతి 80 సీట్లు, 6, 7వ తరగతిలో చెరొకటి, 8వ తరగతిలో 3, 9వ తరగతిలో రెండు సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూగురుకులం.ఏపీ.జీఓవీ.ఇన్‌(https://www.aptwgurukulam.ap.gov.in/)లో సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష ఏప్రిల్‌ 21న ఆయాపాఠశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ 9490957218, గురుకులం సెల్‌ ఇన్‌చార్జ్‌ 9490971090 నంబర్లను సంప్రదించాలని కోరారు.

 

#Tags