Results Released: ఫలితాలు విడుదల విద్యార్థులకు తీపి కబురు

Results Released

కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండవ మరియు నాలుగవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ వంటి కోర్సుల విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఫలితాలు విడుదల కావడంతో క్యాంపస్‌లో ఆనందం వ్యక్తమవుతోంది.

నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా: Click Here

విద్యార్థులు హాజరు మొత్తం:

కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి. మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్. నర్సింహాచారి కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌లో మొత్తం 68,211 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 19,563 మంది (28.68%) ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్‌లో మొత్తం 56,972 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 20,922 మంది (36.72%) ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థులకు సూచనలు:

తమ ఫలితాలను కేయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఫలితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, పది రోజులలోపు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం, విద్యార్థులు కేయూ పరీక్షల విభాగాన్ని సంప్రదించవచ్చు.

#Tags