Good News Schools Holiday 2024 : న‌వంబ‌ర్ 7వ తేదీన స్కూల్స్‌, కాలేజీలు సెలవు ప్ర‌క‌టించిన‌ ప్ర‌భుత్వం.. 15వ తేదీన కూడా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే దేశ‌వ్యాప్తంగా దీపావ‌ళి పండ‌గ‌కు రూపంలో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా ప్ర‌భుత్వం మ‌రో గుడ్‌న్యూస్ చెప్పింది.

స్కూల్స్‌, కాలేజీలు, ప్రభుత్వ ఉద్యోగులకు న‌వంబ‌ర్‌ 7వ తేదీన (గురువారం) సెల‌వును ప్ర‌క‌టించారు. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 1) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15వ తేదీన (శుక్రవారం) సెలవు ఉంటుంది.

దీనిని దృష్టిలో పెట్టుకుని...
ఎన్సీటీ ప్రజలకు ఛత్ పూజ ఒక ముఖ్యమైన పండుగ అని.. దీనిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7వ తేదీన పబ్లిక్ హాలీడే ఇస్తున్నట్లు ఢిల్లీ ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఛత్ పండుగ కోసం నగరవ్యాప్తంగా 1000 మోడల్ ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం అతిశీ తెలిపారు. ఢిల్లీలో లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజను సులభతరం చేసేందుకు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాత్కలిక ఘాట్‌లను నిర్మిస్తామన్నారు.

ఎక్కువగా మహిళలు... 
దీపావళి పండుగ తర్వాత ఛత్ పూజను జరుపుకుంటారు. ఛత్ పూజ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా 'పూర్వాంచాలిస్' బీహార్, తూర్పు యూపీ స్థానికులు పెద్ద ఎత్తున ఛత్ పూజను జరుపుకుంటారు. ఛత్ పూజలో భాగంగా భక్తులు సూర్యదేవుడిని ఆరాధిస్తారు. ఎక్కువగా మహిళలు ఈ ఛత్ పూజలో పాల్గొంటారు. భక్తులు మోకాళ్ల లోతు నీటిలో నిలబడి అర్ఘ్య ఆచారాన్ని పాటిస్తారు.

#Tags