Private Schools: విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా ప్రవేశాలకు దరఖాస్తులు.. తేదీ విడుదల..!

అర్హత, ఆసక్తి ఉన్నవారు ప్రకటించిన విధంగా పోర్టల్‌లో తమ వివరాలను ప్రకటించిన తేదీలోగా నమోదు చేసుకోవాలని డీఈఓ తెలిపారు. ఈ విషయంపై విలేకరులతో మాట్లాడుతున్న డీఈఓ పూర్తి వివరాలను వెల్లడించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: విద్యా హక్కు చట్టం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ దేవరాజు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలు ఈ పథకానికి అర్హులని వివరించారు.

PM SHRI Scheme: పీఎం శ్రీ పథకానికి 21 పాఠశాలలు ఎంపిక..

ఆసక్తి ఉన్న వారు www.cse.ap.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణకు తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, రేషన్‌ కార్డు, భూమి హక్కుల పత్రం, జాబ్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, విద్యుత్‌ బిల్లు, రెంటల్‌ అగ్రిమెంట్‌ కాపీల్లో ఏదైనా ఒకటి జత చేయాలి. జనన ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

DY Chandrachud: గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి న్యాయ విద్య!!

మార్చి 20 నుంచి 22 వరకూ గ్రామ సచివాలయ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ విద్యార్థుల అర్హతలను నిర్ధారిస్తారని చెప్పారు. ఏప్రిల్‌ 1న మొదటి విడత లాటరీ ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు. ఏప్రిల్‌ 2 నుంచి 10వ తేదీ వరకూ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారిస్తారన్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత లాటరీ ఫలితాలు ప్రకటించి, ఏప్రిల్‌ 16 నుంచి 23 వరకూ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను కల్పిస్తారని డీఈఓ తెలిపారు.

#Tags