Essay competitions: 26, 29 తేదీల్లో వ్యాసరచన పోటీలు

శ్రీకాకుళం కల్చరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో నైతిక పరివర్తన, మానవత్వ విలువలు పెంపొందించేందుకు సెప్టెంబర్ 26, 29 తేదీల్లో వ్యాసరచన పోటీ లు నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.లక్ష్మణరావు తెలిపారు. స్థానిక పెందమందిరంలో వినాయక ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8, 9, 10 తరగతి విద్యార్థులకు ‘ఆచార్యదేవో భవ’ అంశంపైన, ఇంటర్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ‘ప్రకృతియే ఉత్తమ గురువు’ అనే అంశంపైన, డిగ్రీ ఆపై స్థాయి విద్యార్థులకు ‘మానవత్వంను పెంపొందించు విద్యావశ్యకత’ అనే అంశంపై తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రిమ్స్‌ అన్నపూర్ణ ట్రస్టు అధ్యక్షులు గంగుల రమణబాబు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 100 గంటల అఖండ నామ సంకీర్తన 40 మందిరాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల ప్రారంభంలో వరం చారిటబుల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ సమాజ సేవకులు అంధవరపు ప్రసాద్‌ దంపతులు గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చదవండి: School Holidays: సెప్టెంబర్ 28న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు?.. కార‌ణం ఇదే..!

#Tags