Digital Classes: విద్యార్థులకు డిజిటల్‌ బోధన..

పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్‌తోనే బోధన చేస్తున్నారు ఉపాధ్యాయులు. వారికి అన్ని విషయాలు స్పష్టంగా అర్థం అయ్యేలా నేర్పుతున్నారు..

సాక్షి ఎ‍డ్యుకేషన్‌: రెండు చిత్రాలను గమనించారా.. ఒక తరగతి గదిలో టేబుల్‌పై ట్యాబ్‌లతో విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తుంటే.. మరో తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్‌ (ఐఎఫ్‌పీ)పై ఉపాధ్యాడు డిజిటల్‌ విద్యాబోధన చేస్తుండగా విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇవి సంపన్నులు మాత్రమే చదివించగలిగే కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో దృశ్యాలనుకుంటే పొరపాటే.

Students Education: నాడు-నేడు పథకంతో తల్లిదండ్రులకు ఆనందం.. కారణం..?

మొదటిది ఆకివీడు జెడ్పీ హైస్కూల్‌ అయితే రెండవది మొగల్తూరు జెడ్పీ హైస్కూల్‌లో దృశ్యాలు. కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషితో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావిధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇవి నిదర్శనాలు.

#Tags