Nadu Nedu Scheme: రూ.3.88 కోట్లతో జెడ్పీ పాఠశాల అభివృద్ధి
జిల్లాలో పెద్దదైన మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు–నేడు పథకం ద్వారా ఇప్పటి వరకూ ఫేజ్ 1, ఫేజ్ 2లో రూ.3.88 కోట్లు ఖర్చుపెట్టి విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించాం. ఫేజ్ 1లో రూ.1.45 కోట్లు మంజూరుకాగా వాటితో టాయిలెట్స్, తరగతి గదుల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, తరగతుల్లో విద్యుదీకరణ, విద్యార్థులకు బెంచీలు, బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేశాం.
రెండో ఫేజ్‌లో రూ.2.40 కోట్లు మంజూరు కాగా వీటి కోసం 20 అదనపు తరగతి గదులు కట్టాలని నిర్ణయించాం. ఇప్పటికే రూ.90 లక్షలు విడుదలయ్యాయి. మొత్తం 18 తరగతి గదుల నిర్మాణం ప్రారంభించగా 14 తరగతి గదులు శ్లాబ్‌లు పూర్తికాగా 4 తరగతి గదులకు శ్లాబులు వేయాల్సి ఉంది. గడచిన నాలుగేళ్ల నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం 1300 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో జగనన్న విద్యా కానుకలు కూడా అందించాం.
– మునగాల చంద్రశేఖర్‌రెడ్డి, హెచ్‌ఎం, జెడ్పీ బాయ్స్ హైస్కూల్, మార్కాపురం.