Development of School: మనబడితో పాఠశాలల రూపురేకల అభివృద్ధి.. ఇవే మార్పులు..!
విద్యార్థులకు పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తే విధంగా ఉన్న వసతులను ఏపీ ప్రభుత్వం పలు పథకాలతో చేసిన అభివృద్ధి గురించి ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు..

అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాలలు మన బడి నాడు–నేడు పథకంతో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందాయి. గతంలో వర్షం వస్తే ఉరుస్తుండటం, సరైన టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండేవారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది.
KU Semester Exams: కేయూ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇలా..!
పాఠశాలలో విద్యార్థులకు అదనపు తరగతి గదులు, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, అధునాతన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. పాఠశాల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి వాల్ పెయింటింగ్ వేశారు. పాఠశాల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తయారు చేసి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారు.
– గడియారం వెంకటశేష శర్మ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రొద్దుటూరు
#Tags