Entrance Test: గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు తేదీ..!
గిరిజన గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకునేందుకు ఇచ్చిన గడువు తెలిసిందే. అయితే, ఈ తరగతుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ప్రకటించిన తేదీకి ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుందని భైంసా ప్రిన్సిపాల్ తెలిపారు..
భైంసాటౌన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భైంసా ప్రిన్సిపాల్ సుమలత తెలిపారు. 2024 –25 విద్యా సంవత్సరానికిగాను ఆయా తరగతుల్లో ప్రవేశాల కోసం ఈనెల 4 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Women Employment Percentage: మహిళా ఉద్యోగులపై కెరీర్ నెట్స్ నివేదిక..
ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. భైంసాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ఎస్టీ–1, 8వ తరగతిలో ఎస్సీ–1, ఎస్టీ–1, మైనార్టీ–1, 9వ తరగతిలో ఓసీ–1 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. tg.gurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
#Tags