ఉత్తమ విద్యాలయంగా రేగులపాడు కేజీబీవీ

● స్టేట్‌ బెస్ట్‌ స్కూల్‌ అవార్డుకు ఎంపికపై కేజీబీవీ సిబ్బంది హర్షం ● అభినందించిన జిల్లా అధికారులు ● ఆగస్టు 15న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రదానం
Regulapadu KGBV is the best school

వీరఘట్టం: విద్యార్థుల హాజరునమోదు.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన.. విద్యాలక్ష్యాలు చేరుకోవడంతో వీరఘట్టం మండలం రేగుగులపాడు కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ విద్యాలయంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి కేజీబీవీ అధికారులకు గురువారం సమాచారం అందింది. రాష్ట్రంలో ఉన్న 352 కేజీబీవీలలో రేగులపాడు కేజీబీవీను బెస్ట్‌ కేజీబీవీగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై సిబ్బంది, బాలికలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరును డీఈఓ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, జీసీడీఓ రోజారమణి ప్రశంసించారు. కేజీబీ వీ ఎస్‌ఓ రోహిణికి ఫోన్‌చేసి అభినందనలు తెలిపా రు. ఆగస్టు 15న విజయవాడలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు.

● అంచెలంచెలుగా...

వీరఘట్టం మండల కేంద్రంలో 2011 సెప్టెంబర్‌ 2వ తేదీన కేజీబీవీను ప్రారంభించారు. మొదటి రెండేళ్లు 6, 7, 8 తరగతులను నిర్వహించారు. 2013 నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేపట్టా రు. నాలుగేళ్ల పాటు వీరఘట్టంలోని ఓ ప్రవేటు భవనంలో కొనసాగిన కేజీబీవీ, తర్వాత రేగులపాడు వద్ద నిర్మించిన భవనంలోకి మార్చారు. 13 మంది బాలికలతో ప్రారంభమైన కేజీబీవీలో నేడు 222 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 6–10 తరగతి బాలికలు 197 మంది, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ బాలికలు 18 మంది, సెకెండియర్‌ బాలికలు ఏడుగు రు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం కార్పొరేటు స్థాయిలో సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో రేగులపాడు కేజీబీవీలో సీటుకు తీవ్ర పోటీ నెలకొంది.

● పదో తరగతిలో శతశాతం ఫలితాలు

ఏటా పదో తరగతిలో శతశాతం ఫలితాలే నేడు కేజీబీవీని రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిపాయి. పదో తరగతి ఫలితాల్లో అధికమంది అత్యధిక మార్కులు సాధించడం, ప్రతీ తరగతిలో గరిష్టంగా బాలికలు చేరడంతో పాటు హాజరుశాతం మెరుగ్గా ఉండడంతో ఈ ఏడాది బెస్ట్‌ కేజీబీవీగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు.

● ఉత్తీర్ణత శాతం ఇలా...

రేగులపాడు కేజీబీవీ బాలికలు 13 మంది తొలిసారి 2013లో పదోతరగతి పరీక్షలు రాసి శతశాతం ఉత్తీర్ణ త సాధించారు. 2013 నుంచి 2016 వరకు శతశాతం టెన్త్‌ ఫలితాలు సాధించారు. తర్వాత 2017లో 97 శాతం, 2018లో 93 శాతం, 2019లో 96 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 2020 నుంచి 2023 వరకు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 2023లో 33 మంది బాలికలు పదోతరగతి పరీక్షలు రాయగా అందరూ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు. 2022–23లో ప్రారంభించిన ఇంటర్మీడియట్‌ విద్య మొదటి బ్యాచ్‌లో చేరిన ఏడుగురూ ఉత్తీర్ణులయ్యారు.

#Tags