Four Days Schools Holidays 2023 : నేటి నుంచి వరుసగా 4 రోజులు పాటు సెలవులు.. ఆ ఒక్క రోజు తప్ప..
14వ తేదీన ఆ ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే.. వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసిరావడంతో చాలా మంది తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. ఆగస్ట్ 12వ తేదీ రెండో శనివారం కాగా.. ఆగస్ట్ 13వ తేదీ ఆదివారం.. ఆగస్ట్ 15న ఎలాగూ ఇండిపెండెన్స్ డే హాలిడే ఉంది. దీంతో ఆగస్ట్ 14వ తేదీ(సోమవారం) ఒక్క రోజు సెలవు పెట్టుకొని తమ సొంత ఊర్లకు వెళ్తుతున్నారు. జూలై నెలలో దాదాపు స్కూల్స్, కాలేజీలకు దాదాపు 10 నుంచి 13 రోజులు దాకా సెలవులు వచ్చిన విషయం తెల్సిందే. గత రెండు నెలలుగా సిటీ జనానికి ఈ విధంగా వరుసగా సెలవులు కలిసి రాలేదు. దీనికి తోడు రెండు వారాలు వర్షాల పడడంతో ఇళ్లకే పరిమితమయ్యారు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
వరస సెలవులు రావడంతో రిలాక్స్ బాట పట్టడానికి సిటీ వదిలి సొంతూర్లకు వెళ్తున్నారు. ఆగస్టు 11వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం నుంచే ఐటీ ఉద్యోగులు పూర్తి హాలిడే మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నాలుగు రోజులు నగరానికి దూరమంటూ ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మళ్లీ సిటీలో రెగ్యులర్ హడావిడి అంటే వచ్చే దాదాపు బుధవారమే అంటున్నారు.
దాదాపు ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆగస్టు నెలలో స్వాతంత్య దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి ఉన్నాయి. వీటితో పాటు ఆగస్టులో మొత్తం 4 ఆదివారాలు (6, 13, 20, 27) ఉన్నాయి. రెండో శనివారం (ఆగస్టు 12) రోజు సైతం విద్యార్థులకు సెలవు ఉంటుంది. వీటన్నింటినీ కలిపితే ఆగస్టు నెలలో విద్యాసంస్థలకు మొత్తం 8లకు పైగానే రోజులు సెలవులు రానున్నాయి. ఒక వేళ భారీ వర్షాలు కురిస్తే.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణలో ఆగస్టు 29, 30 (మంగళవారం, బుధవారం) వరుసగా రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 రాతపరీక్షలను ఆగస్టు 29 , 30 తేదీలలో నిర్వహించనున్నది.
కింది పట్టికలో స్కూల్స్, కాలేజీలకు ఆగస్టు నెలలో ఇచ్చే సెలవుల వివరాలు మీకోసం..
సెలవులు |
తేదీలు |
స్వాతంత్య దినోత్సవం |
ఆగస్టు 15 |
వరలక్ష్మీ వ్రతం |
ఆగస్టు 25 |
రాఖీ పౌర్ణమి |
ఆగస్టు 30 |
రెండో శనివారం |
ఆగస్టు 12 |
ఆగస్టులో మొత్తం 4 ఆదివారాలు (6, 13, 20, 27) |
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సెలవులు ఇవే..
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.