August Month Schools Holidays list: ఆగస్టు నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే..

Schools Holidays list

కొత్త అకడమిక్ ఇయర్‌లో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నమవ్వడానికి ముందు, కావాల్సినంత విశ్రాంతి ఈ హాలిడేస్‌లో దొరుకుతుంది. దీంతో ఆగస్టు నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు రానున్నాయో తెలుసుకుందాం.

వేసవి సెలవులు ముగియడంతో స్కూళ్లు, కాలేజీలు మళ్లీ క్లాసులను ప్రారంభించాయి. జూన్ నెలలో పాఠశాలలు, ఇంటర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇక, చాలా స్కూళ్లలో యూనిట్ పరీక్షలు కూడా మొదలయ్యాయి.

Schools Closed News: పాఠశాలల మూసివేత కారణం ఇదే..Click Here

కాలేజీల్లో కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. కొత్త అకడమిక్ ఇయర్‌లో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నమవ్వాల్సిన టైమ్ ఆసన్నమైంది. ఇక, ఆగస్టు నెలలో విద్యార్ధులకు భారీగా స్కూళ్లకు హాలీడేస్ రానున్నాయి. ఆగస్టు నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు రానున్నాయో తెలుసుకుందాం.

ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి ఉన్నాయి. దీంతో ఈ నాలుగు రోజుల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.

వీటితో పాటు ఆగ‌స్టులో మొత్తం 4 ఆదివారాలు (4,11,18,19) ఉన్నాయి. రెండో శనివారం (ఆగస్టు 10) రోజు సైతం విద్యార్థులకు సెలవు ఉంటుంది. వీటన్నింటినీ కలిపితే ఆగస్టు నెలలో విద్యాసంస్థలకు మొత్తం 9 రోజులు సెలవులు రానున్నాయి.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం పబ్లిక్ హాలీడే ఉంటుంది. ఇక, ఆగస్టు 16న వరలక్ష్మీ వత్రం. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వత్రానికి స్కూల్ హాలీడే ఉంటుంది. ఇక, 19న రాఖీ బంధన్ ఉంది. అంతేకుండా ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది.

అయితే వేర్వేరు పాఠశాలలు వేర్వేరు హాలిడే షెడ్యూల్స్ కలిగి ఉంటాయి, కొన్నింటికి ప్రతి వారం రెండు రోజులు సెలవులు ఉంటాయి. మరికొన్నింటికి తక్కువ సెలవులు ఉంటాయి. ప్లేగ్రూప్ స్కూళ్లకు మరిన్ని సెలవులు ఉండవచ్చు.

ఆగస్టు 4 వ శనివారం కూడా కొన్ని స్కూళ్లకు సెలవు ఉండొచ్చు. ఇక, ఆగస్టు నెలలో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.

మొత్తానికి 8 నుంచి 9 రోజుల వరకు ఆగస్టు నెలలో స్కూల్ హాలీడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతం, పాఠశాలను బట్టి పైన పేర్కొన్న కొన్ని సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. హాలిడేస్ గురించి పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవచ్చు.

#Tags