Eco Clubs in Schools : బ‌డుల్లో టీచ‌ర్లు, విద్యార్థులు ఎకో క్ల‌బ్‌ల ఏర్పాట్లు చేయాలి..

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా ఎకో క్లబ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా సమగ్ర శిక్ష శాఖ ఏపీసీ పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా బడుల్లో టీచర్లు, విద్యార్థులు ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. శిక్షా సప్తాహ్‌ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నీరు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ, భూమి, గాలి, ఆహారంపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని కోరారు.

Telugu Medium : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు మాధ్యమం బోధన లేకపోవడం విచాకరం..

#Tags