Teacher Award: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో విజయేంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్నిప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, పురపాలక, రెసిడెన్షియల్ పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. పది సంవత్సరాల సర్వీసు ఉండాలని తెలిపారు. దరఖాస్తు నమూనాలు సంబంధిత ఎంఈవో, డీవైఈవోల వద్ద పొందవచ్చని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22లోపు ఎంఈవో, డీవైఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికిచేర్చాలని తెలిపారు.
#Tags