Corporate Institutions: కార్పొరేట్ విద్య‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..!

పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌ కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఈ కార్పొరేట్ విద్య‌ను పొందేందుకు ప్ర‌క‌టించిన తేదీలోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి..

నిర్మల్‌చైన్‌గేట్‌: పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థుల ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకావొద్దనే ఉద్దేశంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్‌ విద్య’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు కార్పొరేట్‌ కాలేజీల్లో రిజర్వేషన్ల వారీగా ప్రవేశాలు కల్పిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, బీసీ–సీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు అర్హులు..

TS Inter Supplementary Exam 2024: నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

కార్పొరేట్‌ కళాశాలల్లో..

పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌ కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎంపికైన ప్రతీ విద్యార్థికి ఫీజు కింద రూ.35 వేలు, ఖర్చుల కింద ఏటా రూ.3 వేలు అందిస్తారు. ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తారు. జిల్లాతోపాటు పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని ఏకార్పొరేట్‌ కళాశాలలో ప్రవేశానికైనా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది.

వీరు అర్హులు..

పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 7 జీపీఏ ఆపైన పాయింట్లు సాధించి ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, క‌స్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌, నవోదయ పాఠశాలల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కేటగిరీల వారీగా ఎక్కువ దరఖాస్తులు వస్తే మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

TS POLYCET 2024: నేడు పాలిసెట్‌ ప్రవేశపరీక్ష..  గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి..

దరఖాస్తులు ఇలా..

అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈనెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పాస్‌ వెబ్‌సైట్‌లో కార్పొరేట్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేసి దరఖాస్తులో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థుల కులం, ఆదాయం ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదోతరగతి మెమో, ఆధార్‌ కార్డు, వసతి గృహాల్లో 8, 9, 10వ తరగతి చదివితే హాస్టల్‌ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌ఫొటోలు, రేషన్‌ కార్డు జిరాక్స్‌ అప్‌లోడ్‌ చేయాలి. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఇక గ్రామీణ ప్రాంత విద్యారుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షలకు మించొద్దు.

TSPSC Group-1 Exam: జూన్‌-9న గ్రూప్‌-1 పరీక్ష.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీల్లో పదో తరగతి చదివి 7.0 జీపీఏ ఆపైగా జీపీఏ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు అర్హులు. గతేడాది జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వివిధ కార్పొరేట్‌ కళాశాలల్లో సీటు పొందారు.

– రాజేశ్వర్‌గౌడ్‌, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి

NDA and NA(2) Notification: ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2) నోటిఫికేషన్‌ విడుద‌ల‌.. ఈ అర్హతతో దరఖాస్తుల‌కు అవకాశం!

#Tags