Annual Exams: ప్రారంభమైన వార్షిక పరీక్షలు.. ఎప్పటివరకు..!

సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ పేరిట నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలు ఒకటో నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రారంభమయ్యాయి. ఈ నెలలో ముగియనున్న పరీక్షల మూల్యాంకనం గురించి డీఈఓ తెలిపారు..

యలమంచిలి రూరల్‌: ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–2 పేరిట నిర్వహిస్తున్న పరీక్షలు ఈ నెల 19 వరకు జరగనున్నాయి. శనివారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం తొమ్మిది గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి విద్యార్థులకు ఈ నెల 16వ తేదీ వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 19 వరకు ముందుగా జారీ చేసిన టైం టేబుల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

Certificate Courses: 30 రోజులపాటు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

ఈసారి బైలింగ్వల్‌ (ద్విభాష) విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలను బైలింగ్వల్‌ పద్ధతిలో ముద్రించిన సంగతి తెల్సిందే. పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థుల ప్రమోషన్‌ జాబితాలు రూపొందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సమ్మెటివ్‌–2 పరీక్షల్లో విద్యార్థుల ప్రగతిని ఈ నెల 22వ తేదీన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి.. వారికి వివరించాలని అధికారులు పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు.

Free Training for Women: నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు వివరాలు..

#Tags