RRC Western Railway Apprentice : ఆర్‌ఆర్‌సీ వెస్ట్రన్‌ రైల్వేలో 5,066 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)–వెస్ట్రన్‌ రైల్వే.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 5,066.
»    డివిజన్‌/వర్క్‌షాప్‌లు: బీసీటీ డివిజన్, బీఆర్‌సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్‌టీఎం డివిజన్, ఆర్‌జేటీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్‌ వర్క్‌షాప్, ఎంఎక్స్‌ వర్క్‌షాప్, బీవీపీ వర్క్‌షాప్, డీహెచ్‌డీ వర్క్‌షాప్, పీఆర్‌టీఎన్‌ వర్క్‌షాప్, ఎస్‌బీఐ ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్, ఎస్‌బీఐ సిగ్నల్‌ వర్క్‌షాప్, హెడ్‌ క్వార్టర్‌ ఆఫీస్‌.
»    ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ, పైప్‌ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్‌.
»    అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 22.10.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
»    ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 23.09.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.10.2024
»    వెబ్‌సైట్‌: https://www.rrcwr.com

Gurukula Students: కొండల్లోకి పారిపోయిన ‘గురుకుల’ విద్యార్థులు

#Tags