Railway Jobs: రైల్వేలో 7951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB JE Recruitment 2024).. 7951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 7951
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE/ B.Tech/B.Sc పూర్తి చేసిన వారు అర్హులు
వయస్సు: 18-33 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ. 500 ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్/పీహెచ్/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:రాతపరీక్ష, డాక్యమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి నెలకు రూ. 35,400-రూ.44,900 ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 29, 2024
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సంప్రదించండి