ECIL Recruitment 2024: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు వేతనం

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాలు: ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌-హార్డ్‌వేర్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌-సాఫ్ట్‌వేర్, పవర్‌ ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ డిజైన్, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్, సైబర్‌ సెక్యూరిటీ.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. 
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.04.2024

దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపడానికి చివరితేది: 20.04.2024.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

చదవండి: CIL Recruitment 2024: కోల్‌ ఇండియా లిమిటెడ్ లో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags