TS POLYCET Results 2024 Direct Link : తెలంగాణ పాలిసెట్‌ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఒకేఒక్క క్లిక్‌తో ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్ పాలిసెట్-2024 ఫలితాలను జూన్ 3వ తేదీన విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో ఫ‌లితాలు చూడొచ్చు.

డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప‌రీక్ష‌కు రాష్ట్రవ్యాప్తంగా 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 82,809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.

ఒకేఒక్క క్లిక్‌తో టీఎస్ పాలిసెట్‌-2024 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

తెలంగాణ పాలిసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
ఇప్పటికే తెలంగాణ పాలిసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20వ తేదీ నుంచి కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 22వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండగా… జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జూలై 7వ తేదీ నుంచి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. జూలై 23వ తేదీన స్పాట్‌ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జూలై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

#Tags