Polycet 2024 Results: రేపు పాలిసెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌..

రేపు పాలిసెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: 

పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ఏటా నిర్వ‌హించే ప‌రీక్ష పాలిసెట్‌. మే 24న పాలిసెట్ రాత ప‌రీక్ష జ‌రిగింది. ఇటీవ‌లె మూల్యాంక‌నం కూడా పూర్త అయ్యింది. ప్ర‌స్తుతం, ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నేపథ్యంలో ఫ‌లితాల విడుద‌లకు సంబంధించి వివ‌రాల‌ను వెల్ల‌డించారు అధికారులు..

Polycet 2024: పాలిటెక్నిక్ ప్ర‌వేశానికి పాలిసెట్ ప‌రీక్ష‌..

రేపు.. అంటే జూన్ 3వ తేదీన ఐఏఎస్‌, తెలంగాణ ఎస్‌బీటీఈటీ చైర్మ‌న్‌ శ్రీ బి. వెంక‌టేషం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సెక్రెట‌రీ, ఎస్‌బీటీఈటీ ఎస్‌.వీ భ‌వ‌న్‌, మాస‌బ్ ట్యాంక్‌, హైద‌రాబాద్‌లో పాలిసెట్ 2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
ఫలితాలను results.sakshieducation.com లో చూడొచ్చు.

#Tags