Agriculture Counselling Schedule: వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుద‌ల‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాల­యం(పీజేటీఎస్‌ఏయూ) పరిధిలోని పాలిటె­క్నిక్‌ కళాశాలతో పాటు విశ్వవిద్యాల­యం గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండేళ్ల వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ డిప్లొ­మా కోర్సు, మూడేళ్ల డిప్లొమాఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 10వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పీజేటీఎస్‌­ఏయూ రిజిస్ట్రార్‌ పి.రఘురామిరెడ్డి జూలై 5న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను రెండ్రోజుల పాటు విశ్వవిద్యాల­యం ఆడిటోరి­యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలీసెట్‌– 2024 ర్యాంకుల ఆధారంగా అభ్య­ర్థుల మెరిట్, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

కౌన్సె­లింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్, అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికెట్లు, ఫీజు తదితర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌  www.pjtsau.edu.inను సంప్రదించా­ల­ని సూచించారు. యూనివర్సిటీ నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం ర్యాంకుల వారీగా అభ్య­ర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు.  

#Tags