Polycet 2024: పాలిటెక్నిక్ ప్ర‌వేశానికి పాలిసెట్ ప‌రీక్ష‌..

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల‌లో ప్రవేశం పొందేందుకు పాలిసెట్‌ రాత ప‌రీక్ష ప్రశాంతంగా ముగిసింది అధికారులు తెలిపారు..

ఆదిలాబాద్‌టౌన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. పాలిటెక్నిక్‌తో పాటు హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమోలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Campus Recruitment: ప్ర‌భుత్వ ఐటీఐ క‌ళాశాల‌లో క్యాంప‌స్ రిక్రూట్మెంట్‌.. ఎప్పుడు?

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 1,059 మందికి గాను 939 మంది (88.66 శాతం) హాజరయ్యారు. ఇందులో బాలురు 531, బాలికలు 408మంది పరీక్ష రాసినట్లు పాలిసెట్‌ జిల్లా సమన్వయకర్త భరద్వాజ తెలిపారు.

EWS Quota For Medical Colleges: అన్ని వైద్య కళాశాలల్లో రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

#Tags