TSCHE: పీజీఈసెట్‌–2023 ఫలితాలు విడుదల.. టాపర్స్‌ వీరే...

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ పోస్టు–గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన పీజీఈసెట్‌–2023 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి జూన్‌ 8న విడుదల చేశారు.
పీజీఈసెట్‌–2023 ఫలితాలు విడుదల.. టాపర్స్‌ వీరే...

ఈ పరీక్షలో మొత్తం 91.48 శాతం అర్హత సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. పలు యూనివర్సిటీల పరిధిలో మొత్తం 19 కోర్సులకు 11,914 సీట్లు ఉన్నాయి. పీజీసెట్‌కు 16,563 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 14,882 (89.85 శాతం) మంది పరీక్ష రాశారు. వీరిలో 11,520 మంది అర్హత సాధించారు. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 2,239 మంది అర్హత సాధించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో 1,158 మంది, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 817 మంది, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో 1,388 మంది, ఫార్మసీలో అత్యధికంగా 4,001 మంది అర్హత పొందారు. జీమ్యాట్, గేట్, జీప్యాడ్‌ పరీక్ష ఫలితాల తర్వాత ఆగస్టులో పీజీ ఇంజనీరింగ్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని లింబాద్రి తెలిపారు. పీజీఈసెట్‌లో టాప్‌ ర్యాంకులు పొందిన వారి పేర్లను జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి వెల్లడించారు.  

☛ TS PGECET 2023 Results - Available Now

కొన్ని బ్రాంచీల్లో వంద మార్కులకు 50 మార్కులు రాకున్నా రాష్ట్ర టాపర్‌గా ర్యాంకులు పొందడం విశేషం. ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌లో జి.దివ్యహంస 47 మార్కులకే టాపర్‌గా నిలిచారు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌లో 44 మార్కులతోనే ఎండీ రహిల్‌ టాప్‌ ర్యాంకు పొందారు. ఈ బ్రాంచీల్లో పరీక్ష రాసిన వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఫలితాల వెల్లడి సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.రవీందర్‌రెడ్డి, కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జె.సురేష్‌కుమార్, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్, రెక్టార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన బ్రాంచీల్లో టాపర్స్‌ వీరే... 

 

#Tags