NEET Ranker Success Storty : 8 ఏళ్లకే పెళ్లి.. ఈ క‌సితోనే చ‌దివి.. నీట్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టి.. డాక్ట‌ర్ అయ్యానిలా..

విజ‌యం సాధించాల‌నే.. ప‌ట్టుద‌ల‌, క‌సి ఉండాలే కానీ ఎన్ని అవాంత‌రాలు ఎదురైన విజ‌య‌తీరాల‌కు చేరుకోవ‌చ్చ‌ని నిరూపించారు.. రాజస్థాన్‌కు చెందిన రూపా. కుటుంబ పరిస్థితుల రిత్యా ఆమె తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల వ‌య‌స్సులోనే పెళ్లి చేశారు.
NEET Ranker Rupa Yadav Success Story

డ‌బ్బు కోసం.. ఈమె భ‌ర్త‌ ఆటో రిక్షా నడిపి..
రూపా యాదవ్‌కు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల రిత్యా ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన రూపా తన ఎనిమిదేళ్ల వయసులో తన ఇంటిని వదిలి తన భర్త కుటుంబంతో నివసించాల్సి వచ్చింది. వివాహ సమయానికి, ఆమె భర్త వయస్సు కేవలం 12 మాత్రమే. రూపా తన పాఠశాల విద్యను పూర్తి చేస్తూనే ఇంటి పనులను, అత్తమామలను చూసుకునేది.

➤☛ NEET UG Exam 2023 Question Paper & Key : నీట్ ప్ర‌శ్నాప‌త్రం ఇదే... ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

ఊళ్లోవాళ్లు హేళన చేస్తున్నా.. 

అయితే రూపాకు చదువుపట్ల ఉన్న అంకితభావాన్ని చూసిన ఆమె భర్త, బావమరిది ఆమెకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆమె చదువుకు నిధులు సమకూర్చడానికి, పుస్తకాలు కొనడానికి ఆమె భర్త డబ్బు సంపాదించడానికి పలు రకాలుగా ప్రయత్నించేవాడు. ఊళ్లోవాళ్లు హేళన చేస్తున్నా.. అదనపు ఆదాయం కోసం ఆటో రిక్షా నడపడం కూడా చేశాడు. అలా కష్టపడి సంపాదించిన డబ్బుతో రూపాను ఆమె భర్త మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం పంపాడు.

Eight New Medical Colleges in Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా 8 మెడికల్‌ కాలేజీలు మంజూరు.. దాదాపు 10000 వ‌ర‌కు సీట్లు..!

దేశంలోనే అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో..

ఇలా రూపా నీట్ 2017 పరీక్షకు హాజరై.. వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కుటుంబానికి మొదటి డాక్టర్‌గా అవతరించింది. ఆమె నీట్ 2017 పరీక్షలో 720 మార్కులకు 603 మార్కులు సాధించింది. ఆల్ ఇండియా ర్యాంక్ లో (AIR) ఆమె 2,612 ర్యాంక్ ను సాధించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఛేదించాలంటే మామూలు విషయం కాదు.

➤☛ NEET 2023 Ranker Success Story : ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

దేశంలోనే అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో ఇదీ ఒకటి. అయితే రూపా యాదవ్ అనే అమ్మాయి ప్రతికూల పేదరికం, అనేక సామాజిక ఒత్తిళ్లతో పోరాడుతున్నప్పటికీ, ఈ పరీక్షలో ఆకట్టుకునే ప్రతిభ కనబర్చి, విజయం సాధించింది. ప్ర‌స్తుతం నీట్‌, ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఈమె స‌క్సెస్ స్టోరీ స్ఫూర్తినిస్తుంది. అలాగే ఈమె నేటి యువ‌త‌రానికి ఒక ఆద‌ర్శంగా చెప్పుకోవ‌చ్చును.

➤☛ NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ ప‌ని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్న‌ట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్‌ కొట్టానిలా..

ఇంటర్‌ తర్వాత బీఎస్సీలో చేరిన ఆమె ఆలిండియా ప్రీ మెడికల్‌ టెస్ట్‌ (ఏఐపీఎంటీ) కూడా రాసి 23 వేల ర్యాంకు తెచ్చుకుంది. ప్రభుత్వ కళాశాలలో సీటు రాకపోయినా, మంచి మార్కులు రావడంతో ఆమెను కోటకు పంపించి నీట్‌కు సన్నద్ధమవ్వడానికి భర్త, బావ అవకాశం ఇచ్చారు. గతేడాది కూడా నీట్‌ రాసిన ఆమె రాణించలేక పోయింది. తర్వాత తన ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చిన ఉపకారవేతనంతో చదువుకుని ఈ ఏడాది పరీక్ష రాసి 2,612వ ర్యాంకు దక్కించుకుని అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.

NEET Seats 2023 : నీట్‌లో జీరో మార్కులు వ‌చ్చిన కూడా సీటు.. ఎలా అంటే.. ఇలా..?

#Tags