NEET 2024 Intimation Slip: నీట్‌ 2024 పరీక్షకు ఇంటిమేషన్‌ స్లిప్‌ విడుదల.. అడ్మిట్‌ కార్డు మాత్రం..!

వైద్య విద్య చదువు కోసం కళాశాలలో చేరేందుకు విద్యార్థులు రాసే ఈ నీట్‌ 2024 పరీక్షకు సంబంధించిన ఇంటిమేషన్‌ కార్డు విడుదలైంది..

సాక్షి ఎడ్యుకేషన్‌: వచ్చేనెల.. అంటే మే 5వ తేదీన నిర్వహించే నీట్‌ 2024 పరీక్షకు కావాల్సిన అడ్మిట్‌ కార్డ్‌కు సంబంధించిన ఇంటిమేషన్‌ స్లిప్పులను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ స్లిప్పులో అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ ప్రకటించిన లింక్‌ను ఉపయోగించవచ్చు https://neet.ntaonline.in/. ఈ లింకులో మీ అప్లికేషన్‌ నంబర్‌, జన్మించిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నంబర్ ఇంక కోర్సు వివరాలను నమోదు చేసి మీ పరీక్ష కేంద్రం గురించి వివరాలను తెలుసుకోవచ్చు. 

swimming Championship: స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏపీకి చెందిన సామదేవ్‌కు కాంస్యం

ఈ స్లిప్పును కేవలం నీట్‌ 2024 పరీక్ష రాసేందుకు దరఖాస్తులు చేసుకున్నవారే పొందగలుగుతారు. ఇప్పుడు ఇంటిమేషన్‌ స్లిప్పు డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ, త్వరలో అభ్యర్థులు వారి అడ్మిట్‌ కార్డును పొందవచ్చు. నీట్‌ పరీక్షను నిర్వహించే రెండు రోజుల ముందు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేయనుంది. ఈ పరీక్ష మే 5వ తేదీన జరగనుంది. ఈ పరీక్ష పూర్తిగా 200 నిమిషాలపాటు జరగనుంది అంటే.. 3 గంటల 20 నిమిషాలు. ఇది ఎంబీబీఎస్‌, బీడీఎస్ వంటి వైద్య విద్య అనుసరించేందుకు ప్రవేశ పరీక్షలు. డిగ్రీ చదివిన అనంతరం, విద్యార్థులు ఆపై చదివే కోర్సులో ప్రవేశం పోందేందుకు రాసే పరీక్షే ఈ నీట్‌..
Satya Rajpurohit: అక్షరశిల్పి..! అతనొక ‘అందమైన చేతిరాత’కు కేరాఫ్‌ అడ్రస్‌!

#Tags