Supreme Court NEET Hearing Plea Live Updates: నీట్‌ పరీక్ష రద్దు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

సాక్షి, న్యూఢిల్లీ : నీట్‌-యూజీ 2024 పేపర్‌ లీకేజీ అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. నీట్‌ -యూజీ 2024 పేపర్‌ లీకేజీపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 

ఈ ఏడాది జరిగిన నేషనల్‌ ఎలిజిబులటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)లో అవకతవకలు జరిగాయిని, ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ సుమారు 38 పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన పిటిషన్‌లను ఇవాళ (జులై 8న) ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌,జస్టిస్ జేబీ పార్దివాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

UCO Bank Apprenticeship: యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయాలి
నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా..పేపర్‌ లీకేజీల కారణంగా నీట్‌ పరీక్షల పవిత్రత దెబ్బతింటుందని, వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు.

నీట్‌ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో నీట్‌-యూజీ 2024 పరీక్ష నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) మాత్రం పరీక్షను న్యాయ బద్దంగా నిర్వహించామని,పరీక్ష జరిగే సమయంలో భారీ ఎత్తున మాల్‌ప్రాక్టీస్‌ జరిగిందనే ఆరోపణల్ని ఖండించింది. నీట్‌ అవకతవకలపై వస్తున్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని స్పష్టం చేసింది.

TSPSC Group 1 Prelims 2024 Results : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారు..

అంతేకాదు,తమ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఎన్‌టీఏ సైతం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్‌టీఏ యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజమైన అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందని, వారి కెరియర్‌తో పాటు అవకాశాలపై ప్రతీ కూల ప్రభావం పడుతుందని తెలిపింది. 

#Tags