NEET UG 2024 City Slip Released : నీట్‌-UG సిటీ స్లిప్‌ వచ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

NEET UG 2024 City Slip Released

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2024) సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ,సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి మీ ఎగ్జామ్‌ సెంటర్‌ను తెలుసుకోవచ్చు.

ఇందులోనే పరీక్ష కేంద్రం, తేదీ, సమయం వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  exams.nta.ac.in/NEET/ను క్లిక్‌ చేసి పరీక్షా కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. త్వరలోనే అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి. కాగా నీట్‌ యూజీ పరీక్షను మే5న నిర్వహించనున్నారు.

ఈ ఏడాది 23.80 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో మే5న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య పరీక్ష జరగనుంది. పరీక్ష వ్యవధి 200 నిమిషాలు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు.  


NEET UG సిటీ స్లిప్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి... 

  • అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.in/NEET/ను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న సిటీ స్లిప్‌పై క్లిక్‌ చేయండి. 
  • అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టినరోజు వివరాలతో లాగిన్‌ అవ్వండి
  • స్క్రీన్‌పై సిటీ స్లిప్‌ కనిపిస్తుంది.. డౌన్‌లోడ్‌ చేసుకోండి


NEET UG సిటీ స్లిప్‌ కోసం డైరెక్ట్‌ లింక్‌ https://neet.ntaonline.in/frontend/web/ ను క్లిక్‌ చేయండి

 

#Tags