NEET merit list: నీట్‌లో ఇక‌పై ఫిజిక్స్ మార్కుల ఆధారంగా ర్యాంకుల ప్ర‌క‌ట‌న‌... ఎప్ప‌టినుంచంటే....!

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష ఫలితాల్లో మెరిట్‌ లిస్ట్ ను నిర్ణయించే ప్రక్రియలో మార్పులు చేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) నిర్ణయించింది. ఒకే స్కోరు వచ్చిన అభ్యర్థులకు ర్యాంక్‌లు కేటాయించడంలో ఇకపై ఫిజిక్స్ మార్కులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.
NEET merit list

ప్రస్తుతం బయాలజీ మార్కులకు ప్రాధాన్యమిస్తుండగా ఇకపై ఆ నిబంధనను సవరించాలని నిర్ణయించింది. 

NEET 2023 Ranker Success Story : క‌శ్మీరీ క‌వ‌ల‌లు... నీట్‌లో అద‌రగొట్టారు...వీరి విజ‌యం ప్ర‌తి ఒక్క‌రికి స్ఫూర్తిదాయ‌క‌మే..!

ఈ మేరకు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్‌ -2023ను జాతీయ వైద్య మండలి ఇటీవల విడుదల చేసింది. ఒకవేళ, సబ్జెక్టుల మార్కులు కూడా ఒకే విధంగా ఉంటే.. అప్పుడు కంప్యూటర్‌ ఆధారిత డ్రా ద్వారా మెరిట్‌ లిస్ట్‌ను తయారు చేయనున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ ఉండదని తెలిపింది. ఈ కొత్త రెగ్యులేషన్స్‌ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.  

NTA: నీట్‌లో ఏపీ విజయకేతనం.. టాప్‌ 15 ర్యాంకర్లు వీరే..

నీట్‌ - యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒకే స్కోరు/మార్కులు సాధించినప్పుడు ‘టై’ అవుతుంది. నిబంధనల ప్రకారం.. అలాంటి సమయాల్లో ర్యాంకులను కేటాయించేందుకు టై-బ్రేకర్‌ రూల్‌ను పాటిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. ఇలా టై అయినప్పుడు బయాలజీ మార్కులను చూస్తారు. 

MBBS Seats: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

అందులో ఎవరికి ఎక్కువ వస్తే వారికి ర్యాంక్ కేటాయిస్తారు. తక్కువ వచ్చిన వారికి ఆ తర్వాతి ర్యాంక్‌ ఇస్తారు. బయాలజీలోనూ ఒకే మార్కులు ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్‌ మార్కులు చూసి ర్యాంకులను కేటాయిస్తున్నారు. సబ్జెక్టుల్లోనూ టై ఉంటే.. అభ్యర్థి వయసు బట్టి.. పెద్దవారికి మొదట ర్యాంక్‌ కేటాయిస్తారు.

Top 10 medical colleges: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థుల స్కోరు సమానమైనప్పుడు.. తొలుత ఫిజిక్స్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. అవి కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత బయాలజీ మార్కులను పరిగణిస్తారు. అప్పటికీ టై వీడకపోతే.. కంప్యూటర్‌తో డ్రా తీసి ర్యాంకును కేటాయించాలని నిర్ణయించింది. ఇది పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.

#Tags