BECIL Contract Jobs : బీఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు..

బిలాస్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఆధ్వర్యంలో బ్రా­డ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌)లో ఒప్పంద ప్రాతిపదికన ల్యా­బ్‌ టెక్నీషియన్, టెక్నీషియన్‌ (ఓటీ/పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 68.
»    పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–36, టెక్నీషియన్‌(ఓటీ/పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ)–32
»    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో.. బీఎస్సీ(మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ/మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.35,400.
»    వయసు: 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌), బీఈసీఐఎల్‌ భవన్, సీ–56/ఏ–17, సెక్టార్‌–62, నోయిడా చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 19.08.2024.
»    వెబ్‌సైట్‌: www.becil.com

Act Apprentice Training : ఆర్‌ఆర్‌సీ–నార్త్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags